Thursday, February 2, 2012

సూర్యదేవాలయం - Sun Temple

సూర్యదేవాలయం

భారతదేశంలో మొత్తం మూడు సూర్యదేవుని ఆలయాలున్నాయి. వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్‌ మందిరం. రెండవది జమ్మూలో ఉన్న మార్తండ్‌ ఆలయం, మూడవది గుజరాత్‌లోని మోడేరాకు చెందిన సూర్యమందిరం. అహ్మదాబాద్‌ నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పవతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.పూ 1022-1063లో చక్రవర్తి భీమ్‌దేవ్‌ పొలంకి 1 నిర్మించాడు.
క్రీ.పూ 1025-1026 ప్రాంతంలో సోమనాథ్‌, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను మహమూద్‌ గజనీ ఆక్రమించుకోవడంతో పోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. పోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుణ్ణి తమ కులదేవతగా కొలిచేవారు. కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుణ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. అదే సమయంలో పోలంకి రాజధానిగా చెప్పుకునే అహిల్‌వాడ్‌ పాటణ్‌' కూడా తన గొప్పదనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోవడం మొదలైంది. తమ పూర్వ వైభవాన్ని కాపాడుకునేందుకు పోలంకి రాజ కుటుంబం, అక్కడి వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా మోడేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది.

No comments:

Post a Comment